Claudia Sheinbaum: ట్రంప్ సుంకాలకు భయపడేది లేదు 1 y ago
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన పరస్పర సుంకాలు, వలసదారుల బహిష్కరణపై స్పందిస్తూ, వాటికి భయపడటం లేదని స్పష్టంచేశారు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్. మెక్సికో ప్రజల మద్దతు ఆమెకు ఉందని, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ట్రంప్, ఫెంటానిల్ అక్రమ రవాణా, వలసదారుల చొరబాట్లను అడ్డుకోవడంలో కెనడా, మెక్సికో విఫలమయ్యాయని ఆరోపించి, 25% సుంకాలు విధించాలని హెచ్చరించారు. కానీ తరువాత ఆ సుంకాలను ఒక నెలకు నిలిపివేశారు.